సోమ్‌దేవ్‌కు నిరాశ | Somdev Devvarman fails to qualify for Sydney ATP event | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్‌కు నిరాశ

Jan 6 2014 12:54 AM | Updated on Sep 2 2017 2:19 AM

సోమ్‌దేవ్‌కు నిరాశ

సోమ్‌దేవ్‌కు నిరాశ

అపియా ఇంటర్నేషనల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు.

సిడ్నీ: అపియా ఇంటర్నేషనల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్ 6-2, 2-6, 3-6తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) చేతిలో ఓటమి చవిచూశాడు.
 
 తొలి సెట్‌ను నెగ్గిన సోమ్‌దేవ్ ఆ తర్వాత తడబడి వరుస సెట్‌లను చేజార్చుకొని మూల్యం చెల్లించుకున్నాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఈ భారత ఆటగాడు మూడుసార్లు మాత్రమే సఫలమయ్యాడు. తన సర్వీస్‌ను మాత్రం నాలుగుసార్లు కోల్పోయాడు. ఇదే టోర్నీ డబుల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత ఆటగాళ్లు లియాండర్ పేస్, రోహన్ బోపన్న వేర్వేరు భాగస్వాములతో బరిలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement