ఈ సారి ‘సోచి’లో... | Sochi to host Anand-Carlsen match | Sakshi
Sakshi News home page

ఈ సారి ‘సోచి’లో...

Jun 12 2014 1:52 AM | Updated on Sep 2 2017 8:38 AM

విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే) మధ్య ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ రీ మ్యాచ్‌కు వేదిక ఖరారైంది. రష్యాలోని ‘సోచి’లో నవంబర్ 7నుంచి 28 వరకు వీరిద్దరు ప్రపంచ కిరీటం కోసం పోటీ పడతారు.

ఆనంద్-కార్ల్‌సెన్ పోరు
 మాస్కో: విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే) మధ్య ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ రీ మ్యాచ్‌కు వేదిక ఖరారైంది. రష్యాలోని ‘సోచి’లో నవంబర్ 7నుంచి 28 వరకు వీరిద్దరు ప్రపంచ కిరీటం కోసం పోటీ పడతారు. వేదికను ప్రకటిస్తూ ‘ఫిడే’ అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యుమ్‌జినోవ్, ఈ మెగా ఈవెంట్ కోసం 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 18 కోట్లు) బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య మ్యాచ్‌లు ఒలింపిక్ విలేజ్‌లో జరుగుతాయి.

దీనికి ఇద్దరు ఆటగాళ్లూ అంగీకరించారు. గత ఏడాది నవంబరులో ఆనంద్, తన వరల్డ్ టైటిల్‌ను కార్ల్‌సెన్‌కు కోల్పోయాడు. అయితే ఈ ఏడాది క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి మరో సారి ప్రపంచ చాంపియన్‌షిప్ పోరుకు అర్హత సాధించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement