స్నేహిత్‌ జంటకు రజతం | snehit pair got silver medal | Sakshi
Sakshi News home page

స్నేహిత్‌ జంటకు రజతం

Jul 27 2017 10:30 AM | Updated on Sep 5 2017 5:01 PM

స్నేహిత్‌ జంటకు రజతం

స్నేహిత్‌ జంటకు రజతం

ఐటీటీఎఫ్‌ వరల్డ్‌ సర్క్యూట్‌ జోర్డాన్‌ జూనియర్, క్యాడెట్‌ ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన ఫిడేల్‌ రఫీక్‌ స్నేహిత్‌ ఆకట్టుకున్నాడు.

జోర్డాన్‌ ఓపెన్‌ టీటీ టోర్నీ  


సాక్షి, హైదరాబాద్‌: ఐటీటీఎఫ్‌ వరల్డ్‌ సర్క్యూట్‌ జోర్డాన్‌ జూనియర్, క్యాడెట్‌ ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన ఫిడేల్‌ రఫీక్‌ స్నేహిత్‌ ఆకట్టుకున్నాడు. జోర్డాన్‌లోని అమ్మాన్‌లో జరిగిన ఈ టోర్నీ జూనియర్‌ డబుల్స్‌ విభాగంలో స్నేహిత్‌ జోడీ రజత పతకాన్ని గెలిచింది. పీఎస్‌పీబీకి చెందిన అనుక్‌ రామ్‌ జైన్‌తో జతకట్టిన స్నేహిత్‌ టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్నాడు.

 

బుధవారం జరిగిన డబుల్స్‌ ఫైనల్లో స్నేహిత్‌–అనుక్‌ రామ్‌ ద్వయం 2–3 (7–11, 13–11, 11–8, 6–11, 9–11)తో భారత్‌కే చెందిన మానుశ్‌ షా–పార్థ్‌ విర్మాని జంట చేతిలో పరాజయం పొందింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో స్నేహిత్‌–అనుక్‌ రామ్‌ జంట 3–2 (3–11, 11–9, 11–7, 7–11, 11–9)తో హు పొ సూన్‌– పెంగ్‌ చిన్‌ (చైనీస్‌ తైపీ)పై, క్వార్టర్స్‌లో 3–0 (13–11, 11–6, 12–10)తో అబెల్‌ అజీజ్‌ యూసుఫ్‌– మేశ్రఫ్‌ అహ్మద్‌ (ఈజిప్టు) జోడీపై నెగ్గారు.
 

Advertisement
 
Advertisement
Advertisement