స్కేటింగ్ చాంప్ తెలంగాణ | Skating Champ Telangana | Sakshi
Sakshi News home page

స్కేటింగ్ చాంప్ తెలంగాణ

Feb 11 2016 12:14 AM | Updated on Sep 4 2018 5:07 PM

స్కేటింగ్ చాంప్ తెలంగాణ - Sakshi

స్కేటింగ్ చాంప్ తెలంగాణ

జాతీయ వార్షిక ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది...

 8 స్వర్ణాలు సహా 17 పతకాలతో అగ్రస్థానం  జాతీయ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్

 హైదరాబాద్: జాతీయ వార్షిక ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో అర్జున అవార్డీ అనూప్ కుమార్ యమా సారథ్యంలోని రాష్ట్ర జట్టు ఏకంగా 17 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 8 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్య పతకాలున్నాయి. అనూప్ ఒక్కడే నాలుగు బంగారు పతకాలు గెలిచాడు. మిగిలిన వారిలో దుండిగళ్ల వేద, సాయి వేదాంత్ రుద్రాంగిలు చెరో స్వర్ణ, కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు. భమిడిపాటి వైభవ్, భ్రమేశ్ రమేశ్ పటేల్ చెరో బంగారు పతకం, కైరవి ఫల్గుణి టక్కర్, ఈశాన్, అభిషేక్ మనీశ్, ఏలూరి సాయి రాహుల్, అరుణిమా వీరబెల్లి తలా ఒక రజత పతకం సాధించారు. సాయి పన్షుల్, ఓంకార్, సాయిశ్రీ శ్వేత, హర్షిత రత్వాని ఒక్కో కాంస్యం గెలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement