చాంపియన్‌ సిద్ధిక్‌ అక్బర్‌

Siddiq Akbar Gets Chess Title - Sakshi

ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: ఐజీఎంఎస్‌ఏ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తమిళనాడు ప్లేయర్‌ సిద్ధిక్‌ అక్బర్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఇండియన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ అకాడమీ (ఐజీఎంఎస్‌ఏ) ఆధ్వర్యంలో రాయదుర్గంలోని ఒయాసిస్‌ స్కూల్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 రౌండ్ల అనంతరం 8 పాయింట్లతో అతను అగ్రస్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన చివరిదైన తొమ్మిదోరౌండ్‌లో తెలంగాణకు చెందిన వర్షిత్‌తో గేమ్‌ను సిద్ధిక్‌ డ్రా చేసుకున్నాడు. సిద్ధిక్‌తో పాటు మరో నలుగురు క్రీడాకారులు 8 పాయింట్లతో తొలి స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు నాగశ్రీ సాయికాంత్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఎస్‌. కృష్ణమూర్తి (తమిళనాడు) మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో చెస్‌64.కామ్‌ సీఈవో జయప్రకాశ్‌ ముఖ్య అతిథిగా విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతగా నిలిచిన సిద్ధిక్‌ రూ. 50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందుకున్నాడు. సాయికాంత్‌ రూ. 35,000, కృష్ణమూర్తి రూ.30,000 ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీఎస్‌సీఏ) కార్యదర్శి కేఎస్‌ ప్రసాద్, ఉపాధ్యక్షుడు కేఏ శివప్రసాద్, ఐజీఎంఎస్‌ఏ కార్యనిర్వహణాధికారి ప్రొఫెసర్‌ పి. కామేశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.  

తొలి పది స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు: 1. సిద్ధిక్‌ అక్బర్, 2. నాగశ్రీ సాయికాంత్, 3. కృష్ణమూర్తి, 4. వర్షిత్‌ (తెలంగాణ), 5. ఎం. అనిల్‌ (తెలంగాణ), 6. జె. మనోజ్‌ రంజిత్‌ (తమిళనాడు), 7. ప్రజ్వల్‌ (మహారాష్ట్ర), 8. వై. సేతుమాధవ్‌ (ఆంధ్రప్రదేశ్‌), 9. జి. హేమ ఈశ్వర్‌ (ఆంధ్రప్రదేశ్‌), 10. సంజీవన్‌ సింగ్‌ సర్దార్‌ (తెలంగాణ).

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top