న్యూఢిల్లీ: ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు నిన్నటివరకు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. దానిని ఇప్పుడు వెస్టిండిస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ సమం చేశారు. 12 బంతుల్లో అర్థ శతకం బాది తన రికార్డును గేల్ సమం చేయడం యువీకి నిరాశ కలిగించిందట. అదే 10 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి.. తన రికార్డును బద్దలుకొట్టి ఉంటే తాను మరింత ఆనందించేవాడినని యువరాజ్ చెప్పాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో గేల్ యూవీ రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై యువరాజ్ ట్విట్టర్లో స్పందిస్తూ '12 బంతుల్లో ఫిఫ్టీ కొట్టి గేల్ నన్ను నిరాశ పరిచాడు. కాకా(గేల్) నెక్స్ట్ టైం 10 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదు. లేదంటే ఏబీ డివీలియర్స్ ఆ ఫీట్‌ను సాధించే అవకాశముంది' అని పేర్కొన్నాడు.
20-20లో తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోతున్న క్రిస్ గేల్ 7 సిక్సులు, నాలుగు ఫోర్లతో ఇటీవల 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ కొట్టి యూవీ రికార్డును సమం చేశాడు. 2007లో టీ-20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువీ మొదట ఈ అరుదైన ఘనతను సాధించాడు. స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి.. భారత క్రికెట్ అభిమానుల మదిలో చెరుగని జ్ఞాపకాలను నమోదుచేసిన ఈ స్టైలిస్ట్ బ్యాట్స్‌మన్ 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు.
ఈసారి 10 బంతుల్లోనే ఆ రికార్డు కొట్టాలి!
Published Wed, Jan 20 2016 3:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement