మన్‌ప్రీత్‌ కౌర్‌కు భారీ షాక్‌ | Shot Putter Manpreet Kaur Banned For Four Years As Doping Positive | Sakshi
Sakshi News home page

షాట్‌పుటర్‌ మన్‌ప్రీత్‌ కౌర్‌కు షాక్‌

Apr 10 2019 8:50 AM | Updated on Apr 10 2019 8:51 AM

Shot Putter Manpreet Kaur Banned For Four Years As Doping Positive - Sakshi

2017లో గెలుచుకున్న ఆసియా చాంపియన్‌షిప్‌ స్వర్ణంతో పాటు జాతీయ రికార్డును కూడా మన్‌ప్రీత్‌ కోల్పోనుంది.

న్యూఢిల్లీ : ఆసియా చాంపియన్‌గా నిలిచిన షాట్‌పుటర్‌ మన్‌ప్రీత్‌ కౌర్‌పై వేటు పడింది. డోపింగ్‌కు పాల్పడినందుకు ఆమెపై జాతీయ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (నాడా) నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని ‘నాడా’ డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌ నిర్ధారించారు. 2017లో మన్‌ప్రీత్‌ నాలుగు సార్లు డోపింగ్‌ పరీక్షల్లో విఫలమైంది. ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన జూలై 20, 2017నుంచి తాజా శిక్ష అమల్లోకి వస్తుంది. అయితే తనపై విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ యాంటీ డోపింగ్‌ అప్పీల్‌ ప్యానెల్‌కు ఆమె అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

కాగా శాంపుల్‌ సేకరించిన నాటి నుంచి ఆమె అన్ని ఫలితాలు చెల్లవంటూ ‘నాడా’ ప్యానెల్‌ తీర్పునివ్వడంతో 2017లో గెలుచుకున్న ఆసియా చాంపియన్‌షిప్‌ స్వర్ణంతో పాటు జాతీయ రికార్డును కూడా మన్‌ప్రీత్‌ కోల్పోనుంది. షాట్‌పుట్‌లో 18.86 మీటర్ల రికార్డు మన్‌ప్రీత్‌ పేరిటే ఉంది. 2017లో ఆసియా గ్రాండ్‌ప్రి, ఫెడరేషన్‌ కప్, ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్, ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఏకంగా నాలుగు సార్లు ‘పాజిటివ్‌’గా తేలింది.  వీటిలో ఒక సారి  మెటనొలోన్, మరో మూడు సార్లు డైమిథైల్‌బుటిలమైన్‌ వంటి నిషేధిక ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement