బాస్‌.. నాకు ఓపెనింగ్‌  కొత్త కాదు

Shikhar Dhawan Responds To Warners Comments - Sakshi

వార్నర్‌ కామెంట్స్‌పై ధావన్‌

కామెంటేటర్‌ల గురించి అనవసరం

న్యూఢిల్లీ: ఇటీవల టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ-ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌లు ఇద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో మరో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆటగురించి అనవసరపు చర్చ పెట్టారు. అసలు ధావన్‌తో ఓపెనింగ్‌ అనుభవాలను చెప్పాలని వార్నర్‌ కోరగా, దానికి రోహిత్‌ పలు విశేషాలను షేర్‌ చేసుకున్నాడు.  ‘ధావన్‌ ఒక ఇడియట్‌(నవ్వుతూ). తొలి బంతిని ఫేస్‌ చేయడానికి ఇష్టపడేవాడు కాదు. స్టైక్‌ తీసుకోవడానికి ధావన్‌కు ఇష్టం ఉండేది కాదు. 2013లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నేను ఓపెనర్‌గా అరంగేట్రం చేశా. అప్పుడు ధావన్‌తో ఒక అనుభవం ఎదురైంది. అది చాంపియన్స్‌ ట్రోఫీ. ఓపెనర్‌గా నా తొలి మ్యాచ్‌. ఆ సమయంలో ధావన్‌ను స్ట్రైక్‌ తీసుకోమన్నా. నేను కొత్త బంతితో బౌలర్లను ఎదుర్కోలేని కారణంగా ధావన్‌ను స్ట్రైక్‌ తీసుకోమని అడిగా. దానికి ధావన్‌ ఒప్పుకోలేదు. లేదు రోహిత్‌.. నువ్వు చాలా కాలం నుంచి ఆడుతున్నావ్‌. ఇది నా తొలి పర్యటన. అందుచేత నువ్వే ఇన్నింగ్స్‌ను ఆరంభించాలన్నాడు. ఇక చేసేది లేక నేనే స్టైక్‌ తీసుకున్నా. ఇప్పుడు ధావన్‌తో బాగానే ఉంది’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. దీనికి వార్నర్‌ కూడా అంగీకరించాడు. (ధావన్‌ ఒక ఇడియట్‌.. స్ట్రైక్‌ తీసుకోనన్నాడు..!)

తనతో పాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ధావన్‌ ఓపెనింగ్‌ చేసిన విషయాల్ని షేర్‌ చేసుకున్నాడు.  ఇది ఎవరు చెబుతారా అని నిరీక్షిస్తున్నట్లు తెలిపాడు. ధావన్‌ గురించి బాగా జడ్జ్‌ చేశావంటూ వార్నర్‌ పేర్కొన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు ధావన్‌లో కాస్త అసహనాన్ని కల్గించినట్లే కనబడుతున్నాయి. తాజాగా ఇర్ఫాన్‌పఠాన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న ధావన్‌.. వార్నర్‌ వ్యాఖ్యలపై స్పందించాడు. ‘ నాకు ఓపెనింగ్‌ కొత్త కాదు.. ఎనిమిదేళ్లుగా ఓపెనింగ్‌ చేస్తున్నా. నేను ఏదో తొలి బంతిని ఆడటాన్ని, మొదటి ఓవర్‌ను ఆడటాన్ని ఇష్టపడనని అన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఒకవేళ తొలి ఓవర్‌ను ఆడకపోతే, రెండో ఓవర్‌నైనా ఆడాలి కదా. మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా కొనసాగుతున్నా. ఒకవేళ మనకు సీమింగ్‌ వికెట్‌ ఎదురైతే కాస్త కఠినంగా ఉంటుంది. కానీ ఆడక తప్పదు కదా. పేస్‌ బౌలర్లను ఆడకపోతే ఇక ఓపెనింగ్‌కు దిగడం ఎందుకు. నేను ఓపెనర్‌ అయినప్పుడు నాకు తొలి ఓవర్‌ను ఎందుకు ఆడలేను’ అని ధావన్‌ సమాధానమిచ్చాడు. ఇక కామెంటేటర్‌ వ్యాఖ్యలను తాను అసలు పట్టించుకోనన్నాడు. ‘మనం సెంచరీ చేసినప్పుడు కొనియాడే వ్యాఖ్యతలే, మనం డకౌట్‌ అయితే విమర్శిస్తారు.. అది వారి జాబ్‌.  మనం కూడా కామెంటరీ బాక్స్‌లో ఉంటే అదే చేస్తాం. అందుకు వారు పని వారు చేయాలి. మన పని మనం చేయాలి’ అని ధావన్‌ తెలిపాడు. (‘క్రికెట్‌ చరిత్రలో ధోనినే పవర్‌ఫుల్‌’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top