శాశ్వత పరిష్కారం కావాలి:ధోని | Shifting IPL matches not solution to drought, says mahendra singh Dhoni | Sakshi
Sakshi News home page

శాశ్వత పరిష్కారం కావాలి:ధోని

Apr 10 2016 5:09 PM | Updated on Sep 3 2017 9:38 PM

శాశ్వత పరిష్కారం కావాలి:ధోని

శాశ్వత పరిష్కారం కావాలి:ధోని

మహారాష్ట్రలో నీటి కరువు కారణంగా ఐపీఎల్ మ్యాచ్లను వేరే చోటకి తరలించాలనడం సరికాదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు.

ముంబై: మహారాష్ట్రలో నీటి కరువు కారణంగా ఐపీఎల్ మ్యాచ్లను వేరే చోటకి తరలించాలనడం సరికాదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. రాష్ట్రంలో చోటు చేసుకున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమని ధోని స్పష్టం చేశాడు.

 

'ఐపీఎల్ మ్యాచ్లకు కొద్ది శాతం నీరు మాత్రమే అవసరమవుతుంది. ఐపీఎల్ మ్యాచ్ ల తరలింపుతో రాష్ట్రంలో చోటు చేసుకున్న పూర్తిస్థాయి సమస్యకు పరిష్కారం లభించదు. దానికి శాశ్వత పరిష్కారం వెతకాలి. రాష్ట్రంలో కరువు ఉన్న ప్రాంతాలకు నీటిని ఎలా అందించాలి దానిపై అంతా దృష్టి సారించాలి. ఇప్పటికే  నీటి సమస్యపై చర్చ తారాస్థాయికి చేరింది.  మరోవైపు రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయా?లేదా?అనే సందేహం కూడా ప్రజల్లో ఉంది' అని ధోని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement