వేలంలో షకీబ్‌ బ్యాట్‌కు రూ. 18 లక్షల 20 వేలు | Shakib Al Hasan auctions bat for Bangladesh coronavirus victims | Sakshi
Sakshi News home page

వేలంలో షకీబ్‌ బ్యాట్‌కు రూ. 18 లక్షల 20 వేలు

Apr 24 2020 5:52 AM | Updated on Apr 24 2020 5:52 AM

Shakib Al Hasan auctions bat for Bangladesh coronavirus victims - Sakshi

షకీబుల్‌ హసన్

కరోనా బాధితుల సహాయార్థం నిధుల సేకరణకు తనకెంతో ఇష్టమైన బ్యాట్‌ను వేలానికి పెట్టిన బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ ప్రయత్నానికి మంచి స్పందన  లభించింది. ఆన్‌లైన్‌ వేలంలో అతని బ్యాట్‌ 24 వేల డాలర్లు (రూ. 18 లక్షల 20 వేలు) పలికింది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ ఓ బంగ్లాదేశీ ఈ బ్యాట్‌ను దక్కించుకున్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఈ బ్యాట్‌తోనే విశేషంగా రాణించిన షకీబ్‌ 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో మొత్తం 606 పరుగులు సాధించాడు. బుకీల గురించి బోర్డుకు సరైన సమయంలో సమాచారం ఇవ్వని కారణంగా అతనిపై రెండేళ్ల నిషేధం విధించారు. ఈ అక్టోబర్‌తో నిషేధం ముగియనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement