షేక్‌ హుమేరాకు టైటిల్‌ | Shaik Humera is champion | Sakshi
Sakshi News home page

షేక్‌ హుమేరాకు టైటిల్‌

Apr 14 2019 4:41 PM | Updated on Apr 14 2019 4:41 PM

Shaik Humera is champion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి షేక్‌ హుమేరా సత్తా చాటింది. కోల్‌కతాలో జరిగిన ఈ టోర్నీలో హుమేరా మహిళల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

శనివారం జరిగిన టైటిల్‌పోరులో హుమేరా 6–1, 4–6, 7–5తో యుబ్రాని బెనర్జీ (కోల్‌కతా)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో హుమేరా 40 ర్యాంకింగ్‌ పాయింట్లు సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిక్కీ పునాచ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో టాప్‌ సీడ్‌ నిక్కీ పునాచ 6–3, 6–4తో దక్షిణేశ్వర్‌ సురేశ్‌పై గెలుపొందాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement