టీ20ల్లో షఫాలీ వర్మ నయా రికార్డు

Shafali Verma Scripts Record After New Zealand Blitz - Sakshi

ఆమె ఒక రాక్‌స్టార్‌: సెహ్వాగ్‌

మెల్‌బోర్న్‌: భారత మహిళా క్రికెటర్‌ షఫాలీ వర్మ నయా రికార్డు నెలకొల్పారు. తాజా టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన షఫాలీ  11 బౌండరీలు, 8 సిక్స్‌లతో మొత్తంగా 114 పరుగులు సాధించారు. ఈ క‍్రమంలోనే 172.7 స్టైక్‌రేట్‌ను నమోదు చేశారు. ఫలితంగా ఒక టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన క్రీడాకారిణిగా షఫాలీ రికార్డును లిఖించారు. ఇక ఓవరాల్‌గా టీ20ల్లో 147. 97 స్టైక్‌ రేట్‌ను నమోదు చేసి మరో రికార్డును ఖాతాలో వేసుకున్నారు. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో కనీసం 200 పరుగులు సాధించిన జాబితా ప్రకారం అత్యధిక స్టైక్‌రేట్‌ రికార్డును 16 ఏళ్ల షఫాలీ సొంతం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెంది ఖోల్‌ టైరోన్‌, ఆస్ట్రేలియాకు చెందిన అలీసా హేలీ వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నారు. (ఇక్కడ చదవండి: పదే పదే అవే తప్పులు: కెప్టెన్‌)

ఈ రోజు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షఫాలీ 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టి 46 పరుగులు సాధించే క్రమంలో 135.29 స్టైక్‌రేట్‌ను నమోదు చేశారు. ఫలితంగా మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక స్టైక్‌రేట్‌ రికార్డును సాధించారు. కివీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 133 పరుగులు చేయగా, కివీస్‌ 129 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్‌ సెమీస్‌లోకి ప్రవేశించింది. తాజా వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా భారత్‌ నిలిచింది. (ఇక్కడ చదవండి: హ్యాట్రిక్‌ విజయంతో సెమీస్‌లోకి..)

ఆమె ఒక రాక్‌స్టార్‌
మహిళల క్రికెట్‌ జట్టు సెమీస్‌కు చేరడంపై టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌పై విజయం నిజంగా అద్భుతమని కొనియాడాడు. ఒత్తిడిని జయించి కివీస్‌పై పైచేయి సాధించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక షఫాలీ వర్మను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఆమెకు రాక్‌స్టార్‌ అంటూ ప్రశంసించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top