సెరెనా అలవోకగా.. | serena Williams sails into fourth round | Sakshi
Sakshi News home page

సెరెనా అలవోకగా..

Jan 22 2016 4:11 PM | Updated on Sep 3 2017 4:07 PM

సెరెనా అలవోకగా..

సెరెనా అలవోకగా..

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ అలవోకగా నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది.

మెల్బోర్న్:ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ అలవోకగా నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో రౌండ్ పోరులో నల్ల కలువ సెరెనా 6-1, 6-1 తేడాతో అన్ సీడెడ్ రష్యన్ భామ దారియా కసిత్కినాపై విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సెరెనా దాటికి కసిత్కినా నిలబడలేపోయింది. మరోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ను గెలుచుకుని ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాలని భావిస్తున్నసెరెనా అందుకు తగ్గట్టుగానే ఆకట్టుకుంది. సెరెనా వరుస సెట్లను చేజిక్కించుకుని కసిత్కినాను కంగుతినిపించింది.

ఇదిలా ఉండగా,  పురుషుల డబుల్స్ మ్యాచ్ లో మహేష్ భూపతి-గైల్స్ ముల్లర్ జోడి రెండో రౌండ్ లోనే ఇంటిదారి పట్టింది.  భూపతి-ముల్లర్ ద్వయం 3-6, 2-6 తేడాతో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ జోడి చేతిలో పరాజయం పాలై టోర్నీ  నుంచి భారంగా నిష్క్రమించింది.  53 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్ లో భూపతి-ముల్లర్ జోడి ఏమాత్రం ప్రతిఘటించకపోవడంతో ఓటమి తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement