సీజన్ ముగింపు టోర్నీకి సెరెనా దూరం | Serena Williams out of WTA Finals after shoulder injury | Sakshi
Sakshi News home page

సీజన్ ముగింపు టోర్నీకి సెరెనా దూరం

Oct 18 2016 12:56 AM | Updated on Sep 4 2017 5:30 PM

సీజన్ ముగింపు టోర్నీకి సెరెనా దూరం

సీజన్ ముగింపు టోర్నీకి సెరెనా దూరం

మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ నుంచి ఐదుసార్లు మాజీ విజేత

సింగపూర్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ నుంచి ఐదుసార్లు మాజీ విజేత సెరెనా విలియమ్స్ వైదొలిగింది. భుజం గాయం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన సెరెనా వివరించింది. సింగపూర్ వేదికగా ఈ టోర్నీ ఈనెల 23 నుంచి 30 వరకు జరుగుతుంది. ప్రపంచ సింగిల్స్ ర్యాంకిం గ్‌‌సలో టాప్-8లో ఉన్న వాళ్లు ఈ టోర్నీలో ఆడతారు. ‘సింగపూర్‌కు వచ్చి అత్యుత్తమ క్రీడాకారిణులతో ఆడాలని ఆశించాను.
 
 కానీ భుజం గాయం పూర్తిగా తగ్గాలంటే నిలకడగా చికిత్స తీసుకోవాలని నా వైద్యుడు సూచించాడు. దాంతో రాబోయే కొన్ని వారాలపాటు నేను ఆటకు దూరంగా ఉంటాను’ అని సెరెనా తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఇప్పటికే ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), సిమోనా హలెప్ (రొమేనియా), అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ముగురుజా (స్పెరుున్), మాడిసన్ కీస్ (అమెరికా), సిబుల్కోవా (స్లొవేకియా) అర్హత సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement