శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సేనానాయకే, న్యూజిలాండ్ ఆఫ్ స్పిన్నర్ కేన్ విలియమ్సన్‌లపై ఉన్న సస్పెన్షన్‌ను అంతర్జాతీయ క్రికెట్ ....
దుబాయ్: శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సేనానాయకే, న్యూజిలాండ్ ఆఫ్ స్పిన్నర్ కేన్ విలియమ్సన్‌లపై ఉన్న సస్పెన్షన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎత్తేసింది. తమ లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు బౌలింగ్ పరీక్షలో నిబంధనలకు లోబడి బంతులు వేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఇద్దరు బౌలర్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ వేయవచ్చని ఐసీసీ తెలిపింది.
అయితే భవిష్యత్‌లో వీరిద్దరి బౌలింగ్ శైలిపై అనుమానం వస్తే అంపైర్లు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. మరోవైపు తమ ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్ల పేర్లను వారి జట్లు ఇంతకుముందే చేర్చాయి.