భారత్ సెమీస్ ప్రత్యర్థి కొరియా | semis opponent in Korea | Sakshi
Sakshi News home page

భారత్ సెమీస్ ప్రత్యర్థి కొరియా

Oct 28 2016 12:53 AM | Updated on Sep 4 2017 6:29 PM

ఆసియా చాంపియన్‌‌స ట్రోఫీ హాకీ టోర్నీ సెమీఫైనల్లో భారత్ జట్టు శనివారం కొరియాతో తలపడుతుంది.

కౌంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్‌‌స ట్రోఫీ హాకీ టోర్నీ సెమీఫైనల్లో భారత్ జట్టు శనివారం కొరియాతో తలపడుతుంది. లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత భారత్ 13 పారుుంట్లతో అగ్రస్థానంలో నిలవగా... మలేసియా, పాకిస్తాన్, కొరియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గురువారం మలేసియా, కొరియా జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఒకవేళ ఈ మ్యాచ్‌లో కొరియా గెలిచి ఉంటే... సెమీస్‌లో భారత్‌కు పాక్ ప్రత్యర్థిగా ఎదురయ్యేది. మ్యాచ్ డ్రాగా ముగిసినందున కొరియా పారుుంట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్, కొరియాల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. మరో సెమీస్‌లో మలేసియా, పాకిస్తాన్ తలపడతారుు.

Advertisement
 
Advertisement
Advertisement