సైనాకు రెండో సీడ్ | Second seed to Saina | Sakshi
Sakshi News home page

సైనాకు రెండో సీడ్

May 21 2015 1:13 AM | Updated on Sep 3 2017 2:23 AM

సైనాకు రెండో సీడ్

సైనాకు రెండో సీడ్

డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో రెండో సీడింగ్ లభించింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్

 సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో రెండో సీడింగ్ లభించింది. ఈనెల 26న సిడ్నీలో మొదలయ్యే ఈ టోర్నీలో సైనా తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో తలపడుతుంది. హైదరాబాద్‌కే చెందిన పి.వి.సింధు తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్, ఎనిమిదో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్‌లో విటింగ్‌హస్ (డెన్మార్క్)తో శ్రీకాంత్; వాంగ్ జెంగ్‌మింగ్ (చైనా)తో కశ్యప్; తియాన్ హువీ (చైనా)తో ప్రణయ్ పోటీపడతారు.

Advertisement
 
Advertisement
Advertisement