
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు 13 ఏళ్ల తర్వాత టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించిన గోల్‌కీపర్ సవితా పునియా ఈ విజయం తన జీవితంలోనూ మార్పు తెస్తుందని ఆశాభావంతో ఉంది. తొమ్మిదేళ్లుగా ఆమె భారత జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తున్నా ఇంకా నిరుద్యోగిగానే ఉంది.
‘మెడల్ లావో... నౌక్రీ పావో’ (పతకం గెలవండి, ఉద్యోగం పొందడి) పథకం కింద ఉద్యోగం ఇస్తామని హరియాణా ప్రభుత్వ క్రీడాధికారులు హామీలు ఇస్తున్నా... అదింకా కార్యరూపం దాల్చడం లేదు. ఆసియా కప్ విజయంతోనైనా వారి హామీ ఆచరణ సాధ్యం కావాలని 27 ఏళ్ల సవిత కోరుకుంటోంది.