డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’కు సాత్విక్‌–చిరాగ్‌ జంట | Satwik-Chirag qualify for Indonesia Open | Sakshi
Sakshi News home page

డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’కు సాత్విక్‌–చిరాగ్‌ జంట

Jun 13 2017 5:08 AM | Updated on Sep 5 2017 1:26 PM

ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో మెయిన్‌

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. చిరాగ్‌ శెట్టితో కలిసి బరిలోకి దిగిన సాత్విక్‌ సోమవారం జరిగిన రెండు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో గెలి చాడు. తొలి రౌండ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 22–20, 21–9తో అల్తాఫ్‌ బారిక్‌–రీనార్డ్‌ (ఇండోనేసియా) జంటపై... రెండో రౌండ్‌లో 21–18, 21–16తో సబర్‌ కర్యామన్‌–ఫ్రెంగీ పుత్రా (ఇండోనేసియా) జోడీపై గెలిచింది. మంగళవారం జరిగే మహిళల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)తో సైనా... పోర్న్‌పవీ (థాయ్‌లాండ్‌)తో సింధు ఆడతారు.

Advertisement
 
Advertisement
Advertisement