కాంస్యంతో సరిపెట్టుకున్న సరిత, రాణి | Sarita Devi, Pooja Rani settles for bronze medal | Sakshi
Sakshi News home page

కాంస్యంతో సరిపెట్టుకున్న సరిత, రాణి

Sep 30 2014 11:41 AM | Updated on Sep 2 2017 2:11 PM

సరితా దేవి

సరితా దేవి

భారత మహిళా బాక్సర్ ఎల్. సరితా దేవి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు ఎల్. సరితా దేవి, పూజా రాణి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన సెమీస్ లో కొరియా బాక్సర్ జినా పార్క్ చేతిలో సరితా దేవి పరాజయం పాలయింది.

మరో భారత మహిళా బాక్సర్ పూజా రాణి కూడా 75 కేజీల విభాగం సెమీస్‌లో లి కియాన్ (చైనా) చేతిలో పూజ ఓడిపోయింది. సెమీ ఫైనల్లో ఓటమి పాలవడంతో సరితా దేవి, పూజా రాణిలకు కాంస్య పతకాలు దక్కాయి.

Advertisement
 
Advertisement
Advertisement