breaking news
Pooja Rani
-
World Boxing Championships 2025: చరిత్ర సృష్టించిన భారత బాక్సర్
భారత బాక్సింగ్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. లివర్‌పూల్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్-2025లో ముగ్గురు మహిళా బాక్సర్లు పతకాలు సాధించారు. నుపూర్ 80 ప్లస్ కేజీల విభాగంలో రజత పతకం సాధించగా.. పూజా రాణి 80 కేజీల విభాగంలో కాంస్యం.. తాజాగా జైస్మిన్ లంబోరియా 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ఫలితం (ముగ్గురు మహిళా బాక్సర్లకు పతకాలు) ఇదే.చరిత్ర సృష్టించిన లంబోరియా తాజాగా జరిగిన 57 కేజీల విభాగం ఫైనల్లో జైస్మిన్ లంబోరియా పోలాండ్‌కి చెందిన ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ జూలియా సెరెమెటాపై 4-1 స్ప్లిట్ డెసిషన్‌తో విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. నూతన గ్లోబల్ బాక్సింగ్ గవర్నింగ్ బాడీగా 'వరల్డ్ బాక్సింగ్' ఏర్పడ్డాక జరుగుతున్న తొలి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇదే.నుపూర్‌కు రజతంఇదే టోర్నీలో 80 ప్లస్ కేజీల విభాగంలో నుపుర్ గోల్డ్ మిస్ అయ్యింది. అగాటా కాజ్‌మార్స్కాతో (పోలాండ్) ఫైనల్లో నుపుర్ 2-3తో పోరాడి ఓడింది.పూజా రాణికి కాంస్యం80 కేజీల విభాగంలో పూజా రాణి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్‌కి చెందిన ఎమిలీ ఆస్క్విత్‌తో సెమీఫైనల్లో గట్టిగానే పోరాడింది.భారత బాక్సింగ్‌లో చారిత్రక ఘట్టంభారత బాక్సింగ్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారి ముగ్గురు మహిళా బాక్సర్లు ఫైనల్స్‌కు చేరారు. జైస్మిన్, నుపుర్ ఇది వరకే స్వర్ణం, రజతం సాధించగా.. మీనాక్షి 48 కేజీ విభాగంలో స్వర్ణం కోసం పోటీపడాల్సి ఉంది. -
పూజా రాణికి పతకం ఖాయం
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత్‌కు మూడో పతకం ఖాయమైంది. ఇప్పటికే నుపుర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు), జైస్మీన్ లంబోరియా (57 కేజీలు) సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకోగా... 80 కేజీల విభాగంలో పూజా రాణి కూడా సెమీస్‌లో అడుగు పెట్టింది. తొలి రౌండ్లో ‘బై’ దక్కించుకున్న 34 ఏళ్ల పూజ క్వార్టర్ ఫైనల్లో 3:2 తేడాతో ఎమిలియా కొటెరస్కా (పోలాండ్)పై విజయం సాధించింది. సెమీఫైనల్లో ఎమిలీ అస్క్విత్ (స్విట్జర్లాండ్)తో పూజ తలపడనుంది. పురుషుల 65 కేజీల విభాగంలో అభినాశ్ జమ్వాల్ 1:4తో ఒలింపిక్ కాంస్య పతక విజేత లాషా గురులి (జార్జియా) చేతిలో ఓడాడు. ఇక భారత్ నుంచి జాదూమణి సింగ్ (48 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) మాత్రమే పోటీలో ఉన్నారు. తాష్కెంట్లో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి దీపక్ భోరియా (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) కాంస్యాలు సాధించారు. -
Asian Boxing Championship: పూజా పసిడి పంచ్
దుబాయ్: నాలుగు పసిడి పతకాలు నెగ్గాలనే లక్ష్యంతో రింగ్‌లోకి అడుగుపెట్టిన భారత మహిళా బాక్సర్లు చివరకు ఒక స్వర్ణ పతకంతో సంతృప్తి పడ్డారు. ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆదివారం మహిళల విభాగంలో నాలుగు ఫైనల్స్‌లో పోటీపడ్డ భారత బాక్సర్లలో డిఫెండింగ్ చాంపియన్ పూజా రాణి (75 కేజీలు) మళ్లీ స్వర్ణం సొంతం చేసుకోగా... ఐదుసార్లు చాంపియన్ మేరీకోమ్ (51 కేజీలు), తొలిసారి ‘ఆసియా’ టోర్నీ లో ఆడిన లాల్‌బుత్సాహి (64 కేజీలు), అనుపమ (ప్లస్ 81 కేజీలు) రజత పతకాలు గెలిచారు. ఫైనల్లో పూజా రాణి 5–0తో మవ్లుదా మవ్లోనోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన పూజా రాణికి సెమీఫైనల్లో ‘వాకోవర్’ లభించింది. పూజాకు స్వర్ణ పతకంతోపాటు 10 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 25 వేలు) లభించింది. ఇతర ఫైనల్స్‌లో మేరీకోమ్ 2–3తో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నజీమ్ కిజైబే (కజకిస్తాన్) చేతిలో... లాల్‌బుత్సాహి 2–3తో మిలానా సఫ్రనోవా (కజకిస్తాన్) చేతిలో... అనుపమ 2–3తో లజత్ కుంగ్జిబయేవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. మేరీకోమ్, లాల్‌బుత్సాహి, అనుపమాలకు రజత పతకాలతోపాటు 5 వేల డాలర్ల చొప్పున (రూ. 3 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. సెమీఫైనల్లో ఓడిన లవ్లీనా (69 కేజీలు), సిమ్రన్‌జిత్ (60 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సాక్షి చౌదరీ (64 కేజీలు), మోనిక (48 కేజీలు), సవీటి బురా (81 కేజీలు) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. నేడు జరిగే పురుషుల విభాగం ఫైనల్స్‌లో అమిత్ పంఘాల్ (52 కేజీలు), శివ థాపా (64 కేజీలు), సంజీత్ (91 కేజీలు) బరిలోకి దిగనున్నారు. -
నాలుగు పతకాలు ఖాయం
చెన్నై: మగోమెడ్ సాలమ్ ఉమఖనోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మహిళా బాక్సర్లు సత్తా చాటారు. ఏకంగా నలుగురు సెమీస్ చేరి భారత్‌కు పతకాలను ఖాయం చేశారు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల 69 కేజీల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లవ్లీనా బొర్గోహైన్ (భారత్) 5–0తో అనస్తాసియ సిగెవ (రష్యా)పై విజయం సాధించింది. 75 కేజీల విభాగంలో పూజా రాణి (భారత్) 4–1తో లారా మమెద్కులోవ (రష్యా)పై గెలిచి ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. అదే విధంగా మహిళల క్వార్టర్స్‌లో నీరజ్ (57 కేజీలు) 4–1తో సయాన సగతేవ (రష్యా)పై గెలవగా... జాని (60 కేజీలు) 5–0తో అనస్తాసియ ఒబుషెంకోవ (బెలారస్)ను ఓడించి సెమీస్ చేరింది. అయితే కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత పింకీ జాంగ్రా (51 కేజీలు)కు మాత్రం క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. ఆమె 0–5తో యులియా అపనసోవిచ్ (బెలారస్) చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు పురుషుల విభాగంలో 2018 కామన్వెల్త్ గేమ్ పసిడి పతక విజేత గౌరవ్ సొలంకీ (56 కేజీలు), గోవింద్ సహాని (49 కేజీలు), సంజిత్ (91 కేజీలు),అభిషేక్ (52 కేజీలు) క్వార్టర్స్ చేరారు. -
కాంస్యంతో సరిపెట్టుకున్న పూజారాణి
ఇంచియాన్:ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ లో మేరీ కోమ్ ఫైనల్ కు చేరగా, మరో ఇద్దరు బాక్సర్లు సెమీ ఫైనల్లో నిష్క్రమించారు. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో పూజా రాణి 0-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆమెకు కాంస్య పతకానికే పరిమితమైంది. ఇంచియాన్ లో జరుగుతున్న ఏషియాడ్ క్రీడల్లో ఆమె మహిళల 69-75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన పోరులో చైనా క్రీడా కారిణి లీ కైన్ చేతిలో ఓటమి చెందింది. సెకెండ్ రౌండ్ లో ఆకట్టుకున్న పూజారాణి.. మూడో రౌండ్ కు వచ్చే సరికి చతికిలబడింది. రెండో రౌండ్ లో 27 పాయింట్లు సాధించిన పూజారాణి ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. అనంతరం మూడో రౌండ్ లో పదునైన పంచ్ లతో చెలరేగిన లీ కైన్.. జడ్జిల నుంచి అత్యధిక పాయింట్లు సాధించి పూజారాణికి చెక్ పెట్టింది. ఇదిలా ఉండగా నాల్గో రౌండ్ లో పూజారాణి పుంజుకుందామని ప్రయత్నాలను లీ అడ్డుకుని ఫైనల్ కు చేరుకుంది. అంతకుముందు మహిళల 48-51 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో మేరీకోమ్ ఫైనల్ రౌండ్ కు చేరింది.వియాత్నం బాక్సర్ లి థాయ్ బాంగ్ పై మేరికోమ్ 3-0 తేడాతో గెలుపొందింది. ఫైనల్స్‌లో మేరీకోమ్ విజయం సాధిస్తే భారత్‌కు మరో పసిడి పతకం దక్కనుంది.అయితే సరితా దేవి కూడా సెమీ ఫైనల్లో ఓటమి చెందడంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. -
కాంస్యంతో సరిపెట్టుకున్న సరిత, రాణి
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు ఎల్. సరితా దేవి, పూజా రాణి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. 60 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన సెమీస్ లో కొరియా బాక్సర్ జినా పార్క్ చేతిలో సరితా దేవి పరాజయం పాలయింది. మరో భారత మహిళా బాక్సర్ పూజా రాణి కూడా 75 కేజీల విభాగం సెమీస్‌లో లి కియాన్ (చైనా) చేతిలో పూజ ఓడిపోయింది. సెమీ ఫైనల్లో ఓటమి పాలవడంతో సరితా దేవి, పూజా రాణిలకు కాంస్య పతకాలు దక్కాయి. -
మూడు పతకాలు ఖాయం
బాక్సింగ్ ఆసియా క్రీడల బాక్సింగ్‌లో భారత్‌కు కనీసం మూడు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ఆదివారం ముగ్గురు భారత బాక్సర్లు మేరీకోమ్, సరితా దేవి, పూజా రాణి సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరు తమ విభాగాల్లో సెమీస్‌లో ఓటమిపాలైనా కనీసం కాంస్యం దక్కుతుంది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్ సునాయాసంగా సి హైజువన్ (చైనా)ను చిత్తు చేసింది. మేరీకంటే 10 ఏళ్లు చిన్నదైన చైనా ప్రత్యర్థి మూడో రౌండ్లో కొంత పోటీ ఇవ్వగలిగినా...ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత బాక్సర్ ముందు నిలబడలేకపోయింది. సెమీస్‌లో మేరీకోమ్... వియత్నాంకు చెందిన లి థాయ్ బాంగ్‌తో తలపడుతుంది. 60 కేజీల విభాగంలో సరితాదేవి, సడ్ ఎర్డిన్ (మంగోలియా)పై ఘన విజయం సాధించింది. సెమీస్‌లో సరిత... జినా పార్క్ (కొరియా)ను ఎదుర్కొంటుంది. 75 కేజీల విభాగం క్వార్టర్స్‌లో పూజా రాణి, చైనీస్ తైపీకి చెందిన షెన్ దారా ఫ్లోరాను ఓడించింది. పదునైన అప్పర్‌కట్‌లతో చెలరేగిన పూజను ప్రత్యర్థి అడ్డుకోలేకపోయింది. సెమీస్‌లో లి కియాన్ (చైనా)తో పూజ పోటీ పడుతుంది. పురుషుల 49 కేజీల విభాగంలో క్వార్టర్స్ చేరేందుకు దేవేంద్రో సింగ్‌కు 87 సెకన్ల సమయం సరిపోయింది. దేవేంద్రో ‘నాకౌట్’ పంచ్‌తో బౌన్‌ఫోన్ (లావోస్)ను చిత్తు చేశాడు. క్వార్టర్స్‌లో అతను షిన్ జాంగున్ (కొరియా)ను ఢీకొంటాడు.