సరితాదేవిపై ఏడాది నిషేధం | Sarita Devi banned for one year | Sakshi
Sakshi News home page

సరితాదేవిపై ఏడాది నిషేధం

Dec 17 2014 2:40 PM | Updated on Sep 2 2017 6:20 PM

భారత బాక్సర్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఏడాది పాటు నిషేధం విధించింది.

న్యూఢిల్ల: భారత బాక్సర్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఏడాది పాటు నిషేధం విధించింది. ఆసియా గేమ్స్లో తనకు అన్యాయం జరిగిందని సరిత ఆరోపిస్తూ కాంస్య పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. తొలుత జీవితకాలం నిషేధం విధించాలని భావించారు.

కాగా సరిత వెనక్కు తగ్గి కాంస్య పతకాన్ని మళ్లీ స్వీకరించడం, భారత బాక్సింగ్ సమాఖ్య చేసిన ప్రయత్నాలతో నిషేధాన్ని ఏడాదికి తగ్గించారు. గత అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 1 వరకు నిషేధం అమల్లో ఉంటుంది. ఇక భారత కోచ్ బీఐ ఫెర్నాండెజ్ను రెండేళ్లు నిషేధించారు. కాగా సరితపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ కేంద్ర క్రీడల శాఖ అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యకు లేఖ రాసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement