సెమీస్‌లో సానియా జంటకు నిరాశ | Sania's loss to women's doubles | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జంటకు నిరాశ

Aug 20 2017 1:07 AM | Updated on Sep 17 2017 5:42 PM

సెమీస్‌లో సానియా జంటకు నిరాశ

సెమీస్‌లో సానియా జంటకు నిరాశ

సిన్సినాటి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది.

ఒహాయో: సిన్సినాటి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా–షుయె పెంగ్‌ (చైనా) జంట సెమీఫైనల్లో నిష్క్రమించగా... పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) జోడీ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌ల్లో సానియా–షుయె పెంగ్‌ జంట 4–6, 6–7 (4/7)తో సు వీ సెయి (చైనీస్‌ తైపీ)–మోనికా నికెలెస్కూ (రొమేనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.

గంటా 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–షుయె పెంగ్‌లకు తమ ప్రత్యర్థి సర్వీస్‌ను 6 సార్లు బ్రేక్‌ చేసే అవకాశం లభించినా ఒక్కసారి మాత్రమే సఫలమయ్యారు. సానియా జంటకు 37, 278 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 23 లక్షల 91 వేలు)తోపాటు 350 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. బోపన్న–డోడిగ్‌ జోడీ 1–6, 7–6 (7/5), 7–10తో లుకాజ్‌ కుబోట్‌ (పోలాండ్‌)–మార్సెలో మెలో (బ్రెజిల్‌) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. బోపన్న జంటకు 37, 250 డాలర్ల (రూ. 23 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement