
నా హీరోలు వాళ్లే: సల్మాన్ ఖాన్
ఈ ఏడాది బ్రెజిల్లో జరగనున్న రియో ఒలింపిక్స్ లో భారత్ గుడ్ విల్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పేరును ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఈ ఏడాది బ్రెజిల్లో జరగనున్న రియో ఒలింపిక్స్ లో భారత్ గుడ్ విల్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పేరును ప్రకటించారు. 'ఈ రియో ఒలింపిక్స్ లో నా హీరోలు సానియా మిర్జా, సుశీల్ కుమార్, విజేందర్ సింగ్' అని కండలవీరుడు సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. భారత క్రీడాకారునుద్దేశించి మాట్లాడుతూ... ఒలింపిక్స్ లో పాల్గొని భారత్ కోసం పతకాలు సాధించాలి, మరింత పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
భారత క్రీడాకారును కచ్చితంగా ప్రొత్సహించడంతో పాటు వారిలో ప్రేరణ కలిగిస్తానని సల్మాన్ చెప్పారు. ఆటగాళ్లు తమ ఉత్తమ ప్రదర్శన కనబరిచి దేశం ప్రతిష్టను పెంచుతారని చెప్పారు. సల్మాన్ ను నియమాకంపై బాక్సర్ మేరీ కోమ్ హర్షం వ్యక్తం చేశారు. సల్మాన్ తమ ఆటగాళ్లందరిని ప్రొత్సహిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.