సానియా జోడీ నిష్క్రమణ | Sania Mirza-Prarthana Thombare crash out in first round | Sakshi
Sakshi News home page

సానియా జోడీ నిష్క్రమణ

Aug 7 2016 12:03 PM | Updated on Sep 4 2017 8:17 AM

సానియా జోడీ నిష్క్రమణ

సానియా జోడీ నిష్క్రమణ

రియో ఒలింపిక్స్లో భారత ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.

రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో భారత ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.మహిళల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగిన సానియా మీర్జా- ప్రార్థన తోంబ్రే జోడి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన మ్యాచ్లో సానియా ద్వయం 6-7, 5-7, 7-5 తేడాతో చైనా జోడి షాయి జంగ్-షాయి పెంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

 

తొలి సెట్లో పోరాడిన సానియా జంట, రెండు, మూడు సెట్లలో పూర్తిస్థాయి ఆటను ప్రదర్శించలేక పోయింది. దీంతో సానియా ద్వయం తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. ఇక టెన్నిస్ లో భారత ఆశలు మిక్స్డ్ డబుల్స్పైనే ఆధారపడి ఉన్నాయి. మిక్స్డ్ డబుల్స్లో సానియా-రోహన్ బోపన్నలు జోడి కట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు పురుషుల డబుల్స్ పోరులో లియాండర్ పేస్-బోపన్నల జోడి కూడా తొలి రౌండ్లో పరాజయం ఎదుర్కొన్నారు. ఆగస్టు 10వ తేదీన సానియా-రోహన్ బోపన్నలు మిక్స్ డ్ డబుల్స్ లో బరిలోకి దిగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement