నేను తల్లి కాబోతున్నా: సానియా  | Sania Mirza Confirms Pregnancy  | Sakshi
Sakshi News home page

Apr 23 2018 5:56 PM | Updated on Apr 23 2018 5:56 PM

Sania Mirza Confirms Pregnancy  - Sakshi

సానియా మీర్జా

హైదరాబాద్‌ : టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తల్లి కాబోతున్నారు. త్వరలోనే తమ జీవితంలోకి ఓ బేబీ రాబోతుందని సానియానే ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. బెబీ మీర్జా మాలిక్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో తాను గర్భం దాల్చిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ పోస్టుకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఇక సానియా పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను 2010లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.​

గతంలో ఓ ఇంటర్వ్యూలో సానియా మాట్లాడుతూ.. ​‘నేను ఈ రోజు మా కుటుంబ రహస్యం చెప్పాలనుకుంటున్నా. మాకు సంతానం ఎప్పుడు కలిగినా వారి పేర్లలో మా ఇంటి పేర్లు వచ్చేలా ‘మీర్జా మాలిక్‌’ను జోడించాలని నేను, మా ఆయన నిర్ణయించుకున్నాం. నిజానికి షోయబ్ కూడా అమ్మాయే కావాలని ఆశిస్తున్నాడు’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement