రన్నరప్‌ సానియా జంట | Sania Mirza – Barbora Strycova lose in final | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సానియా జంట

Jan 14 2017 12:54 AM | Updated on Sep 5 2017 1:11 AM

రన్నరప్‌ సానియా జంట

రన్నరప్‌ సానియా జంట

కొత్త ఏడాదిలో వరుసగా రెండో టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది.

సిడ్నీ: కొత్త ఏడాదిలో వరుసగా రెండో టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. శుక్రవారం ముగిసిన సిడ్నీ ఓపెన్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా–బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంట రన్నరప్‌గా నిలిచింది. 72 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ సానియా–స్ట్రికోవా ద్వయం 4–6, 4–6 తో తిమియా బాబోస్‌ (హంగేరి)–అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది.

రన్నరప్‌గా నిలిచిన సానియా–స్ట్రికోవా జోడీకి 22,180 డాలర్ల (రూ. 15 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 305 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. గతవారం బెథానీతో కలిసి బ్రిస్బేన్‌ ఓపెన్‌లో టైటిల్‌ నిలబెట్టుకున్న సానియా ఈనెల 16న మొదలయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement