ఫైనల్లో సానియా జంట | Sania Mirza-Barbora Strycova enter Japan final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా జంట

Sep 24 2016 1:41 AM | Updated on Sep 4 2017 2:40 PM

ఫైనల్లో సానియా జంట

ఫైనల్లో సానియా జంట

ఈ ఏడాది ఎనిమిదో డబుల్స్ టైటిల్ సాధించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో విజయం దూరంలో నిలిచింది.

టోక్యో: ఈ ఏడాది ఎనిమిదో డబుల్స్ టైటిల్ సాధించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో విజయం దూరంలో నిలిచింది. పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నమెంట్‌లో తన చెక్ రిపబ్లిక్ భాగస్వామి బార్బరా స్ట్రికోవాతో కలిసి సానియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా-స్ట్రికోవా ద్వయం 4-6, 6-3, 10-5తో గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా)-మరియా జోస్ మార్టినా శాంచెజ్ (స్పెయిన్) జోడీపై విజయం సాధించింది.
 
 అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-స్ట్రికోవా జంట 6-2, 6-2తో మియు కాటో (జపాన్)-యిఫాన్ జు (చైనా) ద్వయంపై నెగ్గింది. శనివారం జరిగే ఫైనల్లో చెన్ లియాంగ్-జావోజువాన్ యాంగ్ (చైనా) జోడీతో సానియా-స్ట్రికోవా జంట తలపడుతుంది. ఈ ఏడాది సానియా బ్రిస్బేన్, సిడ్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్, సెయింట్ పీటర్స్‌బర్గ్, రోమ్ (హింగిస్‌తో కలిసి)... సిన్సినాటి (స్ట్రికోవాతో), న్యూ హవెన్ (మోనికా నికులెస్కూతో) టోర్నమెంట్‌లలో విజేతగా నిలిచింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement