క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్‌ | Sameer Verma, Sai Praneeth reach quarter-finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్‌

May 4 2018 4:19 AM | Updated on May 4 2018 4:19 AM

Sameer Verma, Sai Praneeth reach quarter-finals - Sakshi

సమీర్‌ వర్మ,సాయి ప్రణీత్

అక్లాండ్‌: న్యూజిలాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ లో భారత షట్లర్లు సాయి ప్రణీత్, సమీర్‌ వర్మ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సాయి ప్రణీత్‌ 21–18, 21–17తో డారెన్‌ ల్యూ (మలేసియా)పై; సమీర్‌ వర్మ 21–17, 21–19తో లీ చౌక్‌ యూ (హాంకాంగ్‌)పై గెలుపొంది క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. యువ షట్లర్‌ లక్ష్యసేన్, అజయ్‌ జయరామ్‌ ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యారు. లక్ష్యసేన్‌ 21–15, 15–21, 12–21తో బ్యాడ్మింటన్‌ దిగ్గజం, టాప్‌ సీడ్‌ లిన్‌ డాన్‌ చేతిలో పోరాడి ఓడాడు.

అజయ్‌ జయరామ్‌ 15–21, 22–20, 6–21తో వాంగ్‌ హీ హియో (దక్షిణ కొరియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్‌ రెడ్డి ద్వయం 21–9, 21–12తో అనువిత్‌–నథాపాట్‌ ట్రింకజీ (థాయ్‌లాండ్‌) జోడీ పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శివమ్‌ శర్మ–పూర్విషా రామ్‌ జంట రెండో రౌండ్‌లో 16–21, 14–21తో చాన్‌ పెంగ్‌ సూన్‌–లియూ యింగ్‌ గో (మలేసియా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మేఘన–పూర్విషా రామ్‌ జంట 15–21, 6–21తో డెల్లా హ్యారిస్‌–రిజ్కి ప్రదీప్త (ఇండోనేసియా) చేతిలో ఓడింది.

Advertisement
 
Advertisement
Advertisement