క్వార్టర్స్‌లో సాకేత్‌ జంట  | Saketh-Balaji move up in doubles in China | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్‌ జంట 

Oct 24 2018 1:55 AM | Updated on Oct 24 2018 1:55 AM

Saketh-Balaji move up in doubles in China - Sakshi

న్యూఢిల్లీ: లిజౌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని డబుల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జంట 6–1, 3–6, 10–8తో కెచ్‌మానోవిచ్‌ (సెర్బియా)–జె లీ (చైనా) జోడీపై గెలిచింది.

సింగిల్స్‌ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ రెండో రౌండ్‌కు చేరగా... సుమీత్‌ నాగల్, రామ్‌కుమార్‌ రామనాథన్‌ తొలి రౌండ్‌లో ఓడిపోయారు. ప్రజ్నేశ్‌ 6–4, 7–5తో జొహాన్‌ టాట్లోట్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గగా... సుమీత్‌ 2–6, 3–6తో తత్సుమైతో (జపాన్‌) చేతిలో... రామ్‌కుమార్‌ 6–7 (3/7), 3–6తో డేవిడోవిచ్‌ (స్పెయిన్‌) చేతిలో ఓటమి చవిచూశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement