సాకేత్ పరాజయం | Saket was beaten | Sakshi
Sakshi News home page

సాకేత్ పరాజయం

Oct 28 2016 1:18 AM | Updated on Sep 4 2017 6:29 PM

కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి భారత నంబర్‌వన్ ఆటగాడు సాకేత్ మైనేని

పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి  భారత నంబర్‌వన్ ఆటగాడు సాకేత్ మైనేని నిష్క్రమించాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ 6-7, 6-2, 6-0తో మూడో సీడ్ సాకేత్‌పై విజయం సాధించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టైబ్రేక్ ద్వారా గెలుచుకున్న అనంతరం సాకేత్ కుడి భుజం గాయంతో బాధపడుతూనే మ్యాచ్‌ను కొనసాగించాడు.  

 
పేస్ జంట నిష్క్రమణ

మరో వైపు డబుల్స్‌లో లియాండర్ పేస్-రామ్‌కుమార్ జోడి క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. ఫ్రాన్‌‌సకు చెందిన స్విస్ ల్యూకా-హ్యూగో నైస్ ద్వయం 2-6, 6-3, 10-4 తేడాతో రెండో సీడ్ పేస్ జంటపై విజయం సాధించింది. ఈ పరాజయంతో పేస్ 2016 సీజన్‌ను ముగించాడు.  భారత్‌కే చెందిన టాప్ సీడ్ పూరవ్ రాజా-దివిజ్ శరణ్ జోడి సెమీస్‌కి చేరింది.

 

Advertisement
 
Advertisement
Advertisement