పోరాడి ఓడిన సాకేత్ | Saket fought to loss | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సాకేత్

May 19 2016 1:54 AM | Updated on Sep 4 2017 12:23 AM

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత పోరాటం ముగిసింది.

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని 6-7 (5/7), 5-7తో ఫ్రాన్సెస్ తియాఫో (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.

భారత్‌కే చెందిన రామ్‌కుమార్ తొలి రౌండ్‌లోనే ఓడిన సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్  ఈనెల 22న మొదలవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement