ఫైనల్లో సాకేత్ | Saket finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాకేత్

Feb 21 2016 12:27 AM | Updated on Sep 3 2017 6:03 PM

ఫైనల్లో సాకేత్

ఫైనల్లో సాకేత్

హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో సింగిల్స్ విభాగంలో

న్యూఢిల్లీ: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్ 6-3, 6-2తో రెండో సీడ్ కిమెర్ కాప్‌జాన్స్ (బెల్జియం)పై గెలిచాడు. శక్తివంతమైన సర్వీస్‌లతో అదరగొట్టిన సాకేత్ ఆద్యంతం నిలకడగా ఆడి ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్ స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్)తో సాకేత్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో రాబర్ట్ 6-3, 6-2తో ఫ్లావియో సిపొల్లా (ఇటలీ)పై గెలిచాడు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం 6-3, 4-6, 10-5తో సాకేత్-సనమ్ సింగ్ జంటను ఓడించి విజేతగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement