యామగూచికి సైనా షాక్‌ | Saina stuns world no 2 Yamaguchi to enter Denmark Open quarters | Sakshi
Sakshi News home page

యామగూచికి సైనా షాక్‌

Oct 18 2018 2:17 PM | Updated on Oct 18 2018 2:21 PM

Saina stuns world no 2 Yamaguchi to enter Denmark Open quarters - Sakshi

ఓడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప‍్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక‍్వార్టర్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ 21-15, 21-17 తేడాతో ప్రపంచ రెండో ర్యాంక్‌ క్రీడాకారిణి యామగూచి(జపాన్‌)కి షాకిచ్చి క్వార్టర్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఈ రెండు గేమ్‌ల్లో తొలుత వెనుకబడ్డ సైనా నెహ్వాల్‌.. ఆపై చెలరేగి ఆడారు. 

కేవలం 36 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సుదీర్ఘమైన ర్యాలీలు, చక్కటి ప్లేస్‌మెంట్స్‌తో ఆకట్టకున్న సైనా.. ఎట్టకేలకు యామగూచికి బ్రేక్‌ వేశారు. దాదాపు నాలుగేళ్ల క్రితం చైనా ఓపెన్‌లో యమగూచిపై గెలిచిన సైనాకు ఆ తర్వాత ఇదే ఆమెపై తొలి విజయం. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఇరువురి క్రీడాకారిణుల ముఖాముఖి రికార్డులో యామగూచి 6-1తో ఆధిక్యంలో ఉన్నారు. కాగా, ఈసారి మాత్రం ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా సైనా నెహ్వాల్‌ తన అనుభవాన్ని ఉపయోగించి యామగూచి ఆటకట్టించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement