తొలి సెట్ ను కోల్పోయిన సైనా | saina nehwal lose first in world badminton | Sakshi
Sakshi News home page

తొలి సెట్ ను కోల్పోయిన సైనా

Aug 16 2015 1:11 PM | Updated on Sep 3 2017 7:33 AM

రల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భాగంగా ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తొలి సెట్ ను 16-21 తేడాతో కోల్పోయింది.

జకార్తా: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భాగంగా ఆదివారం ప్రపంచ నంబర్ వన్  కరోలినా మారిన్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తొలి సెట్ ను 16-21 తేడాతో కోల్పోయింది. సైనా ఆదిలో కొంత ఆధిక్యం కనబరిచినా ..తరువాత వరుస పాయింట్లను చేజార్చుకుని సెట్ ను నష్టపోయింది. దీంతో పైనాకు తదుపరి సెట్ ను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఒకవేళ రెండో సెట్ లో కూడా వెనుకంజ వేస్తే.. సైనా టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాల్సి వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement