breaking news
marin carolina
-
సైనాకు తప్పని స్పెయిన్ పెయిన్
-
సైనాకు తప్పని 'స్పెయిన్ పెయిన్'
జకార్తా: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు స్పెయిన్ పెయిన్ తప్పలేదు. గత మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ ఫైనల్లో మారిన్ కరోలినా చేతిలో ఓటమి చవిచూసిన సైనా.. మరోసారి వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఓటమి చెందింది. ప్రపంచ చాంపియన్ షిప్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ కు చెందిన ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా చేతిలో 21-16, 21-19 తేడాతో సైనా ఓటమి పాలైంది. తొలి సెట్ ఆరో గేమ్ వరకూ సైనా ఆధిక్యం కనబరిచినా .. తరువాత వరుస పాయింట్లను చేజార్చుకుని ఆ సెట్ ను నష్టపోయింది. దీంతో వెనుకబడిన సైనా.. రెండో సెట్ లో ఆధిక్యం దిశగా కొనసాగింది. కాగా, సైనా ఆ సెట్ చివర్లో ఒత్తిడికి గురై మ్యాచ్ ను చేజార్చుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ లో తొలిసారి ఫైనల్ కు చేరిన సైనా.. చివరి అడ్డంకిని మాత్రం దాటలేకపోయింది. గతంలో మారిన్ కరోలినాపై సైనా స్పష్టమైన ఆధిక్యం కనబరిచినా.. వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మాత్రం కరోలినాదే పైచేయి అయ్యింది. ప్రత్యర్థి వేగం, దూకుడు ముందు సైనా నిలువలేకపోయింది. సైనా కొత్త చరిత్రను లిఖిస్తుందని భావించినా ఆ ఆశ తీరలేదు. అయితే ఈ టోర్నీలో సైనా నెహ్వాల్ చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చింది. సైనా నెహ్వాల్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తొలిసారి ఫైనల్ కు చేరడంతో రజత పతకంతో సరిపెట్టుకుంది. -
శభాష్ సైనా..
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్ వన్ కరోలినా మారిన్ ను సైనా కంగుతినిపించి స్వర్ణం పతకం చేజిక్కించుకుంది. అంతకుముందు ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ ను ఓడించిన సైనా.. గత మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఆమె చేతిలో ఓడిపోయింది. తాజాగా మరోసారి కరోలినాపై పైచేయి సాధించిన సైనా.. ముఖాముఖి కార్డులో 4-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ ప్రస్థానం ఇలా.. సైనా నెహ్వాల్ మార్చి 17, 1990న హర్యానాలోని హిస్సార్ లో జన్మించింది. తల్లి దండ్రులిద్దరూ హర్యానా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించినవారే. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఈ క్రీడాకారిణి బ్యాడ్మింటన్ లో తనదైన ముద్రతో ముందుకు దూసుకుపోతుంది. సైనా తన చిన్నతనంలో బ్యాడ్మింటన్ శిక్షణ కోసం ఉదయం నాలుగు గంటలకే లేచి, తండ్రి స్కూటర్ మీద వెళ్లేదట. అయితే, అలా వెళ్లే క్రమంలో వెనుక సీటుపై తండ్రిని గట్టిగా పట్టుకుని నిద్రపోయేదట. 2006లో ఫిలిప్పిన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ను గెలిచి స్టార్ ఓపెన్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించటంతో సైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంట్ లో 86వ సీడ్‌గా ప్రవేశించిన ఆమె పలు టాప్‌సీడ్‌లను ఓడించి చివరకు విజేతగా నిల్చింది. అదే సంవత్సరం బీడబ్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌లో రన్నరప్‌గా నిల్చింది. 2007 లో ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింటన్ స్వర్ణాన్ని గెలుచుకుంది. 2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. చైనా మాస్టర్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వరకూ సైనా వెళ్ల గల్గింది. ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించింది. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సాధించింది. 2009 లో ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించి, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లింది. 2010 లో ఆల్ ఇంగ్లండ్ సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం పొందడమే కాకుండా.. ఇండియా ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్ టైటిళ్లును సైనా కైవశం చేసుకుంది. అయితే 2011 ఆరంభంలో స్విస్ ఓపెన్ గెలిచిన సైనాకు ఆ తరువాత ప్రతికూల ఫలితాలే వచ్చాయి. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ లో సైనా రెండో రౌండ్ ను కూడా అధిగమించలేకపోయింది. అదే సంవత్సరం ఆల్ ఇంగ్లండ్ సూపర్ సిరీస్ లో సైనా ఆదిలోనే ఓటమి చెందింది. వరల్డ్ చాంపియన్ షిప్ లో కూడా సైనా ఓటమి చెందడంతో తన మూడో ర్యాంక్ ను కోల్పోయింది. అయితే వరల్డ్ చాంపియన్ షిప్ లో రెండు సార్లు క్వార్టర్స్ వరకూ వెళ్లిన ఘనతను సైనా సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలోనే డెన్మార్ ఓపెన్, ఫ్రెంచ్ సూపర్ సిరీస్,హాంగాక్ సూపర్ సిరీస్ లలో సైనాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 2012వ సంవత్సరంలో సైనా జైత్రయాత్ర కొనసాగింది. ఆరంభంలో జరిగిన స్విస్ ఓపెన్ ను కాపాడుకోవడంలో సైనా సఫలమయ్యింది. ఇండోనేషియా సూపర్ సిరీస్ టైటిల్ ను, సమ్మర్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. డెన్మార్క్ సూపర్ సిరీస్ ను తొలిసారి కైవశం చేసుకుంది. 2014 లో మూడు టైటిళ్లను సైనా గెలుచుకుంది. ఇండియా ఓపెన్, ఆస్ట్రేలియా సూపర్ సిరీస్, చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లను సైనా దక్కించుకుంది. 2015 లో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టైటిల్ సైనాను వరించింది. తరువాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ ఫైనల్ కు చేరి తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సైనా.. చివరి అడ్డంకిని దాటలేకపోయింది. -
తొలి సెట్ ను కోల్పోయిన సైనా
జకార్తా: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భాగంగా ఆదివారం ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తొలి సెట్ ను 16-21 తేడాతో కోల్పోయింది. సైనా ఆదిలో కొంత ఆధిక్యం కనబరిచినా ..తరువాత వరుస పాయింట్లను చేజార్చుకుని సెట్ ను నష్టపోయింది. దీంతో పైనాకు తదుపరి సెట్ ను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఒకవేళ రెండో సెట్ లో కూడా వెనుకంజ వేస్తే.. సైనా టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాల్సి వస్తుంది.