ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సైనా | Saina Nehwal in Australian Open final | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సైనా

Jun 28 2014 2:43 PM | Updated on Sep 2 2017 9:31 AM

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సైనా

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సైనా

ఆస్ట్రేలియా ఓపెన్ లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది.

సిడ్నీ:ఆస్ట్రేలియా ఓపెన్ లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా ఈ రోజు జరిగిన మహిళలు సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో సైనా నెహ్వాల్ టాప్ సీడ్ చైనా క్రీడాకారిణి షిజియాన్ వాంగ్ ను  21-19, 16-21, 21-15 తేడాతో మట్టికరిపించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.  ఈ మ్యాచ్ లో ఆద్యంతం ఆకట్టుకున్న సైనా ఒక గంట 16 నిమిషాల్లోనే  విజయాన్ని కైవసం చేసుకుంది. 

 

తొలి సెట్ ను గెలుచుకుని మంచి ఊపుమీద ఉన్న సైనాకు రెండో సెట్ లో వాంగ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. కాగా, తిరిగి పుంజుకున్న సైనా.. మూడో సెట్ ను సునాయాసంగా గెలుచుకుని తన సత్తాను మరోసారి చాటిచెప్పింది. నిన్న జరిగిన క్వార్టర్స్లో ఆరో సీడ్  సైనా 21-18 21-9తో ఎరికో హిరోసి (జపాన్)పై సునాయాసంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement