రసెల్‌ ఒంటరి పోరాటం

Russell Fifty Takes Knight Riders Past Hundred Against CSK - Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 109 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  కేకేఆర్‌ వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. తొమ్మిది పరుగులకే పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌..స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లు విజృంభించి బౌలింగ్‌ చేసి కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేశారు. కేకేఆర్‌ ఆటగాళ్లో ఆండ్రీ రసెల్‌(50 నాటౌట్‌; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు.  

కేకేఆర్‌ జట్టులో నలుగురు డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో ఆ జట్టు  నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన  కేకేఆర్‌ జట్టులో ఓపెనర్లు క్రిస్‌ లిన్‌ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరితే, సునీల్‌ నరైన్‌(6) కూడా నిరాశపరిచాడు. దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్‌లో లిన్‌ ఔటైతే, హర్భజన్‌ వేసిన రెండో ఓవర్‌లో నరైన్‌ పెవిలియన్‌ చేరాడు. లిన్‌ను చాహర్‌ ఎల్బీ రూపంలో ఔట్‌ చేస్తే, నరైన్‌ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ బాట పట్టాడు.  దీపక్‌ చాహర్‌ అద్భుతమైన క్యాచ్‌తో నరైన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇక సెకండ్‌ డౌన్‌ వచ్చిన నితీశ్‌ రాణా డకౌట్‌ అయ్యాడు. చాహర్‌ వేసిన మూడో ఓవర్‌లో రాణా ఔటయ్యాడు. అటు తర్వాత రాబిన్‌ ఊతప్ప(11), దినేశ్‌ కార్తీక్‌(19)లు కూడా విఫలం కావడంతో కేకేఆర్‌ మరింత ఇబ్బందుల్లో పడింది. అయితే రసెల్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చాహర్‌ మూడు వికెట్లు సాధించగా, హర్భజన్‌ సింగ్‌, ఇమ్రాన్‌ తాహీర్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top