ఇంగ్లండ్‌ 205 ఆలౌట్‌ | run lead as England collapse: second Test, day two | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ 205 ఆలౌట్‌

Jul 16 2017 1:26 AM | Updated on Sep 5 2017 4:06 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగుల ఆధిక్యం లభించింది.

ట్రెంట్‌ బ్రిడ్జ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగుల ఆధిక్యం లభించింది. శనివారం రెండో రోజు 309/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది.

కెప్టెన్‌ రూట్‌ (78; 12 ఫోర్లు) రాణించగా, బెయిర్‌ స్టో (45; 7 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. మోరిస్, కేశవ్‌ మహరాజ్‌ చెరో 3 వికెట్లు, మోర్కెల్, ఫిలాండర్‌ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆడిన సఫారీ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్‌ కోల్పోయి 75 పరుగులు చేసింది. ఎల్గర్‌ (38 బ్యాటింగ్‌), హషీమ్‌ ఆమ్లా (23 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement