పెళ్లిరోజున రో‘హిట్‌’.. రితిక హైలెట్‌! | Rohit Sharma wife Ritika in tears after he hits Third double hundred | Sakshi
Sakshi News home page

రోహిత్‌ భార్య భావోద్వేగం

Dec 13 2017 6:31 PM | Updated on Dec 13 2017 6:55 PM

Rohit Sharma wife Ritika in tears after he hits Third double hundred - Sakshi

మొహాలి: పెళ్లిరోజున ఎవరైనా ఏం చేస్తారు. ఆఫీసుకు సెలవుపెట్టి రోజంతా కుటుంబంతో సరదా గడుపుతారు. కానీ రోహిత్‌ శర్మ బరిలోకి దిగి సరికొత్త రికార్డు లిఖించాడు. చావొరేవో తెల్చుకోవాల్సిన మ్యాచ్‌లో జూలు విధిలించాడు. డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. గత మ్యాచ్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేశాడు. పెళ్లిరోజున తన ఆటను కళ్లారా చూసేందుకు వచ్చిన భార్యకు అపురూపమైన కానుక ఇచ్చాడు. రోహిత్‌ మైదానంలో ఆడుతున్నంతసేపు అతడి అర్థాంగి రితికా సజ్దేహ్ ఆసక్తికరంగా ఆటను తిలకించింది. సెంచరీకి చేరువైన వేళ ఆమె కాస్త ఆందోళన పడింది.

తన భర్త సెంచరీ చేయడం ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆమె ఊపిరి పీల్చుకుంది. రోహిత్‌ కూడా మైదానం నుంచే తన సతీమణికి గాల్లో ముద్దు విసిరాడు. శతకం బాదిన తర్వాత రోహిత్‌ సిక్సర్ల మోత ముగించాడు. సిక్స్‌ కొట్టిన ప్రతిసారి కెమెరామెన్‌ ఆమె హావభావాలను అభిమానులకు చూపించాడు. డబుల్‌ సెంచరీ సాధించినప్పడు రోహిత్‌-రితిక ఆనందం శిఖరాలను తాకింది. రోహిత్‌ మూడో ద్విశతకంతో ప్రపంచ రికార్డు సృష్టించడంతో రితిక కళ్లు ఆనంద భాష్పాలు వర్షించాయి. స్టేడియంలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి. పెళ్లిరోజును మరపురాని జ్ఞాపకంగా మలుచుకున్న ఈ జంటపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

పెళ్లిరోజున మరపురాని జ్ఞాపకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement