జాదవ్‌.. సినిమా ఆఫర్‌ వచ్చిందట కదా! | Rohit Sharma Enjoys a Lovely Bus Drive to Cardiff with Jadeja and Jadhav | Sakshi
Sakshi News home page

జాదవ్‌.. సినిమా ఆఫర్‌ వచ్చిందట కదా!

May 27 2019 9:07 AM | Updated on May 29 2019 2:38 PM

Rohit Sharma Enjoys a Lovely Bus Drive to Cardiff with Jadeja and Jadhav - Sakshi

రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, కేదార్‌ జాదవ్‌

కేదార్‌.. నీ అందానికి, నీలోని ప్రత్యేకతకు బాలీవుడ్‌ మూవీ రేస్‌ 4 చిత్రంలో అవకాశం వచ్చిందంట

లండన్‌ : ప్రపంచకప్‌కు ముందు సన్నాహక సమరాన్ని పరాజయంతో ప్రారంభించిన భారత్‌.. రెండో వార్మప్‌ మ్యాచ్‌కు సిద్దమవుతోంది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగే వార్మప్‌ మ్యాచ్‌తో గాడినపడాలని కోహ్లిసేన వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్‌ కోసం లండన్‌ నుంచి కార్డిఫ్‌కు బస్సులో బయల్డేరిన టీమిండియా ఆటగాళ్లు ఈ ప్రయాణాన్ని తమదైన శైలిలో ఆస్వాదించారు. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఈ జర్నీకి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకోగా.. అది ప్రస్తుతం తెగ వైరల్‌ అయింది. సహచర ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేదార్‌జాదవ్‌లతో కబుర్లు చెబుతూ.. జోక్స్‌ వేసుకున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది.
 
‘హే గాయ్స్‌.. మేం లండన్‌ నుంచి కార్డిఫ్‌ వెళ్తున్నాం. ఒక్కసారి ఇక్కడి అందమైన లొకేషన్స్‌ చూడండి. నాకు కంపెనీగా ఇద్దరు జెంటిల్‌మెన్స్‌ రవీంద్ర జడేజా.. కేదార్‌ జాదవ్‌లు ఉన్నారు. జడ్డూ నీవు మొన్న మస్త్‌ ఆడినవ్‌ యార్‌.’ అని రోహిత్‌ అనగా.. ‘థ్యాంక్స్‌ రోహిత్‌! కఠిన పరిస్థితుల్లో రాణించడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ టోర్నీలో మన జట్టు కూడా ఇలానే రాణిస్తుందని ఆశిస్తున్నాను’ అని జడేజా సమాధానం ఇవ్వగా.. ‘అవును మనం రాణిస్తాం. ఈ ప్రపంచకప్‌ మనకు చాలా ముఖ్యం’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. అనంతరం పక్కనే ఉన్న జాదవ్‌పై రోహిత్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.. ‘జడ్డూతో కూర్చున్న ఈ వ్యక్తి రేస్‌ 4 యాక్టర్‌ కేదార్‌ జాదవ్‌. కేదార్‌.. నీ అందానికి, నీలోని ప్రత్యేకతకు బాలీవుడ్‌ మూవీ రేస్‌ 4 చిత్రంలో అవకాశం వచ్చిందంట కదా’ అని రోహిత్‌ టీజ్‌ చేయగా.. ‘ఇంకా అది ఫైనల్‌ కాలేదు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. రెండు నెలల తర్వాత మీరంతా ఆశ్చర్యపోవచ్చు’ అంటూ జాదవ్‌ అదే రీతిలో సమాధానమివ్వగా అక్కడ నవ్వులు పూసాయి. ఇక టీమిండియా ఆటగాళ్లు జూలై 14న జరిగే ప్రపంచకప్‌ ఫైనల్లో నెగ్గి టైటిల్‌ తీసుకొస్తే తెరమీది హీరోలు కాదు.. రియల్‌ హీరోలు అవుతారని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఈ మెగాటోర్నీకి మరో మూడు రోజుల్లో (మే30న) తెరలేవనున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement