పేస్ కు మరోసారి షాకిచ్చిన బోపన్న! | Rohan Bopanna writes to AITA, does not want Paes as doubles partner | Sakshi
Sakshi News home page

పేస్ కు మరోసారి షాకిచ్చిన బోపన్న!

Jun 10 2016 12:23 PM | Updated on Sep 4 2017 2:10 AM

పేస్ కు మరోసారి షాకిచ్చిన బోపన్న!

పేస్ కు మరోసారి షాకిచ్చిన బోపన్న!

భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ కు మరో ప్లేయర్ రోహన్ బోపన్న షాకిచ్చాడు.

న్యూఢిల్లీ: భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ కు మరో ప్లేయర్ రోహన్ బోపన్న షాకిచ్చాడు. ప్రస్తుతం ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్ లో టాప్-10 లో ఉన్న బోపన్న.. అఖిల భారత టెన్నిస్ సమాఖ్య(ఏఐటీఏ)కు లేఖ రాశాడు. తాను రియో ఒలింపిక్స్ లో తన భాగస్వామిగా లియాండర్ పేస్ ను ఎంచుకోవడం లేదని, సాకేత్ మైనేనిని తనకు జోడీగా పంపించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. సెలక్షన్ కమిటీ మీటింగ్ జరిగిన మరుసటి రోజు ఈ లేఖ విషయం బయటపడింది. ప్రస్తుతం పేస్ 46వ ర్యాంకులో ఉండగా, సాకేత్ మాత్రం 125వ ర్యాంకులో కొనసాగుతుండటం గమనార్హం. సెలక్షన్ కమిటీ జూన్ 11న తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది.

గతంలోనూ ఇలాగే జరిగింది...
నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్ సమయంలో పేస్‌తో కలిసి ఆడేందుకు రోహన్ బోపన్న నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పేస్ టాప్-10లో ఉండటంతో భారత్‌కే చెందిన విష్ణువర్ధన్‌తో కలిసి లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. ఏ భారత క్రీడాకారుడూ ఇప్పటివరకు వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగలేదు. ప్రస్తుతం భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు మాత్రమే ఈ అవకాశముంది. బోపన్న లేఖతో పేస్ చారిత్రక అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం లోఉన్నాడు. శనివారం సెలక్షన్ కమిటీ నిర్ణయంపైనే పేస్ రియో ఒలింపిక్స్ లో పాల్గొంటాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement