ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ఫెడరర్‌ దూరం | Roger Federer to skip French Open and focus on Wimbledon | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ఫెడరర్‌ దూరం

May 17 2017 12:48 AM | Updated on Sep 5 2017 11:18 AM

ఫ్రెంచ్‌  ఓపెన్‌కు ఫెడరర్‌ దూరం

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ఫెడరర్‌ దూరం

రాబోయే గ్రాస్‌ కోర్టు, హార్డ్‌ కోర్టు సీజన్‌లపై మరింత దృష్టి సారించాలని స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం ఫెడరర్‌

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): రాబోయే గ్రాస్‌ కోర్టు, హార్డ్‌ కోర్టు సీజన్‌లపై మరింత దృష్టి సారించాలని స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం ఫెడరర్‌ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 28న మొదలయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

పురుషుల టెన్నిస్‌ చరిత్రలో అత్యధికంగా 18 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన ఫెడరర్‌ ఎర్రమట్టి కోర్టులపై జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ను మాత్రం ఒకే ఒక్కసారి (2009లో) సాధించాడు. మోకాలి గాయం కారణంగా గతేడాది కూడా ఫెడరర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement