టాప్‌ ర్యాంక్‌కు  విజయం దూరంలో...  | Roger Federer slams French Open attacks | Sakshi
Sakshi News home page

టాప్‌ ర్యాంక్‌కు  విజయం దూరంలో... 

Jun 16 2018 1:04 AM | Updated on Jun 16 2018 1:04 AM

Roger Federer slams French Open attacks - Sakshi

స్టుట్‌గార్ట్‌: ఈ సీజన్‌లో రెండోసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సొంతం చేసుకునేందుకు స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ మరో విజయం దూరంలో ఉన్నాడు. మెర్సిడెస్‌ ఓపెన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌ 6–4, 6–4తో గిడో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచి సెమీస్‌కు చేరాడు.

శనివారం జరిగే సెమీఫైనల్లో నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా)తో ఫెడరర్‌ ఆడతాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో కిరియోస్‌ 6–4, 3–6, 6–3తో లోపెజ్‌ (స్పెయిన్‌)పై గెలుపొందాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement