ఎవరో కొత్త విజేత? | French Open womens singles final today | Sakshi
Sakshi News home page

ఎవరో కొత్త విజేత?

Jun 6 2026 3:49 AM | Updated on Jun 6 2026 3:49 AM

French Open womens singles final today

నేడు ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌

సాయంత్రం గం. 6:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రసారం

పారిస్‌: మహిళల టెన్నిస్‌లో ఈరోజు కొత్త గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ అవతరించనుంది. టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శనివారం మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరు జరగనుంది. క్వాలిఫయర్‌ మాయ చావలిన్‌స్కా (పోలాండ్‌), ఎనిమిదో సీడ్‌ మిరా ఆండ్రీవా (రష్యా) తమ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం పోటీపడనున్నారు. చావలిన్‌స్కా గెలిస్తే... ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌; 2021 యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ విజేత) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన రెండో క్వాలిఫయర్‌గా ఘనత వహిస్తుంది. 

పురుషుల సింగిల్స్‌ విభాగంలో  రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), పదో సీడ్‌ ఫ్లావియో కొబోలి (ఇటలీ) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీఫైనల్లో జ్వెరెవ్‌ 7–5, 6–2, 3–6, 6–3తో మెన్‌సిక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందాడు. రెండో సెమీఫైనల్లో గాయం కారణంగా అర్నాల్డి (ఇటలీ) బరిలోకి దిగలేదు. దాంతో అర్నాల్డి ప్రత్యర్థి కొబోలి (ఇటలీ) ఫైనల్‌ చేరుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement