
కోల్‘కథ’ మారింది
లీగ్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ చివర్లో మాత్రం చెలరేగిపోతోంది. అద్వితీయ ఆట తీరుతో ప్లే ఆఫ్ ఆశలు ఏమాత్రం లేని దశ నుంచి పూర్తిగా కోలుకుంది.
ప్లేఆఫ్‌కు చేరువలో నైట్‌రైడర్స్
కీలక మ్యాచ్‌లో చెన్నైపై ఘన విజయం
రాణించిన ఉతప్ప, షకీబ్
కోల్‌కతా: లీగ్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ చివర్లో మాత్రం చెలరేగిపోతోంది. అద్వితీయ ఆట తీరుతో ప్లే ఆఫ్ ఆశలు ఏమాత్రం లేని దశ నుంచి పూర్తిగా కోలుకుంది. మరో సూపర్ ఛేజింగ్‌తో ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరుకున్న చెన్నైని మట్టి కరిపించి మరో అడుగు ముందుకేసింది.
మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గౌతీసేన ఒకదాంట్లో నెగ్గినా దర్జాగా ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ఐపీఎల్-7లో భాగంగా మంగళవారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. టాస్ గెలిచి నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసింది. రైనా (52 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఫామ్‌ను కొనసాగిస్తే... బి.మెకల్లమ్ (24 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్సర్లు), డు ప్లెసిస్ (20 బంతుల్లో 23; 2 ఫోర్లు), ధోని (15 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు. కమిన్స్, చావ్లా, నరైన్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 18 ఓవర్లలో 2 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఉతప్ప (39 బంతుల్లో 67; 10 ఫోర్లు, 1 సిక్సర్), షకీబ్ (21 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. గంభీర్ (21), పాండే (18 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఈశ్వర్ పాండే, జడేజా చెరో వికెట్ తీశారు. ఉతప్పకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రైనా జోరు...: ఓపెనర్లలో స్మిత్ (5) తొందరగా అవుటైనా... కమిన్స్ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టి మెకల్లమ్ ఊపు తెచ్చాడు. ఆరంభం నుంచే దూకుడు చూపెట్టిన రైనా బౌండరీతో ఖాతా తెరిచాడు. రైనాతో కలిసి రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించాక మెకల్లమ్... నరైన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత డు ప్లెసిస్‌తో కలిసిన రైనా.... చావ్లా ఓవర్‌లో వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. ఈ క్రమంలో 43 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఏడు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరు అవుటయ్యారు. ఈ జంట మూడో వికెట్‌కు 36 బంతుల్లో 62 పరుగులు జోడించింది. చివర్లో ధోని, జడేజా వేగంగా ఆడటంతో చెన్నై గౌరవప్రదమైన స్కోరు చేసింది.
శుభారంభం: గంభీర్, ఉతప్ప మెరుపు బ్యాటింగ్ చేస్తూ కోల్‌కతాకు శుభారంభాన్నిచ్చారు. దీంతో పవర్‌ప్లేలో 52 పరుగులు సమకూరాయి. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. గంభీర్ అవుటైనా ఉతప్ప జోరు తగ్గలేదు. 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన ఉతప్ప అవుటైనా... పాండే, షకీబ్ సమయోచితంగా ఆడారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
స్కోరు వివరాలు: చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) కమిన్స్ 5; బి. మెకల్లమ్ (సి) సూర్యకుమార్ (బి) నరైన్ 28; రైనా (సి) టెన్ డస్కెట్ (బి) చావ్లా 65; డు ప్లెసిస్ రనౌట్ 23; ధోని నాటౌట్ 21; జడేజా నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1-5; 2-60; 3-122; 4-129
బౌలింగ్: షకీబ్ 4-0-30-0; కమిన్స్ 4-1-29-1; ఉమేశ్ 4-0-29-0; నరైన్ 4-0-24-1; చావ్లా 4-0-42-1
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) డు ప్లెసిస్ (బి) జడేజా 67; గంభీర్ (బి) పాండే 21; మనీష్ పాండే నాటౌట్ 18; షకీబ్ నాటౌట్ 46; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (18 ఓవర్లలో 2 వికెట్లకు) 156.
వికెట్ల పతనం: 1-64; 2-98
బౌలింగ్: హిల్ఫెన్హాస్ 3-0-38-0; ఈశ్వర్ పాండే 4-0-31-1; మోహిత్ శర్మ 3-0-28-0; అశ్విన్ 4-0-24-0; జడేజా 3-0-23-1; రైనా 1-0-9-0.