కుంబ్లే వస్తువులూ కొట్టేశారు! | robbers looted from cricketer Anil Kumble in green park stadium | Sakshi
Sakshi News home page

కుంబ్లే వస్తువులూ కొట్టేశారు!

Sep 26 2016 12:24 AM | Updated on Aug 30 2018 5:27 PM

కుంబ్లే వస్తువులూ కొట్టేశారు! - Sakshi

కుంబ్లే వస్తువులూ కొట్టేశారు!

అది క్రికెట్ పెద్దలు ఘనంగా నిర్వహిస్తున్న వేడుక... రాష్ట్ర గవర్నర్, మంత్రులు, ఉన్నతాధికారులు, అగ్రశ్రేణి క్రికెటర్లు ఉన్నారు.

అది క్రికెట్ పెద్దలు ఘనంగా నిర్వహిస్తున్న వేడుక... రాష్ట్ర గవర్నర్, మంత్రులు, ఉన్నతాధికారులు, అగ్రశ్రేణి క్రికెటర్లు ఉన్నారు. కానీ అలాంటి చోట కూడా అతి సునాయాసంగా దొంగతనం జరిగిన విషయం ఆలస్యంగా బయటపడింది. కాన్పూర్ టెస్టు తొలి రోజు సన్మానం అందుకునేందుకు ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే కూడా వేదికనెక్కారు. అయితే మర్యాదపూర్వకంగా తన మొబైల్ ఫోన్, కళ్లద్దాలు, క్యాప్‌లను తాను కూర్చున్న చోటే ఉంచి వెళ్లారు. సన్మానం జరిగాక తిరిగొచ్చి చూసేసరికి తన వస్తువులన్నీ గాయబ్! ఎవరైనా పక్కన పెట్టారేమేనని ముందుగా అనుకున్నా... ఎవరో కొట్టేశారని తర్వాత తెలిసింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కుంబ్లే, అనవసరం అంటూ ఫిర్యాదు జోలికి పోలేదు. గ్రీన్‌పార్క్ స్టేడియంలో సెక్యూరిటీ అంటే ఇంతే మరి అంటూ ఇక్కడి పరిస్థితిపై ఒక అధికారి వ్యాఖ్యానించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement