‘రియో’కు ఫిట్‌గా ఉంటా | Rio de Janeiro Olympics | Sakshi
Sakshi News home page

‘రియో’కు ఫిట్‌గా ఉంటా

Mar 1 2016 12:20 AM | Updated on Sep 3 2017 6:42 PM

‘రియో’కు ఫిట్‌గా ఉంటా

‘రియో’కు ఫిట్‌గా ఉంటా

ప్రతిష్టాత్మక రియో డి జనీరో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఎలాంటి గాయాల బెడద లేకుండా ఉండాలని స్టార్ షట్లర్ సైనా .......

 ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు  స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్

బెంగళూరు: ప్రతిష్టాత్మక రియో డి జనీరో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఎలాంటి గాయాల బెడద లేకుండా ఉండాలని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కోరుకుంటోంది. ప్రస్తుతం గాయాల కారణంగా కొద్ది కాలం నుంచి ఆమె ఎలాంటి టోర్నమెంట్స్ ఆడటం లేదు. తాజాగా జర్మన్ ఓపెన్ నుంచి కూడా ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ వైదొలిగింది. ‘లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించాను. అంతా అనుకూలంగా జరిగి ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటే కచ్చితంగా మరో పతకం సాధించాలనుకుంటున్నాను. అందుకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండాలని ఆశిస్తున్నాను. మూడోసారి ఈ క్రీడల్లో పాల్గొంటే అది నాకు గర్వకారణంగా ఉంటుంది’ అని సైనా తెలిపింది.

గాయాలతో ఇప్పటికే ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్, సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి టోర్నీ,  దక్షిణాసియా క్రీడల నుంచి సైనా తప్పుకుంది. ఈసారి ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా... ఊహించి చెప్పేందుకు తానేమీ దేవుణ్ణి కానని, పతకం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపింది. సానియా మీర్జా, కిమ్ క్లియ్‌స్టర్స్ లాంటి టెన్నిస్ క్రీడాకారిణులకు పెళ్లి మంచి ప్రేరణగా పనిచేసిందని, అయితే ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ‘వివాహం చేసుకునేందుకు నేనేమీ భయపడటం లేదు. ప్రతీ అమ్మాయికి ఈ దశ వస్తుంది. అది జరిగినప్పుడు జరుగుతుంది. ఫలానా సమయంలోనే జరగాలనేమీ లేదు’ అని 25 ఏళ్ల ఈ హైదరాబాదీ తేల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement