టాప్లోనే అశ్విన్ | Ravichandran Ashwin Maintains No.1 Spot in Test Rankings, Virat Kohli Stays 2nd | Sakshi
Sakshi News home page

టాప్లోనే అశ్విన్

Jan 8 2017 4:13 PM | Updated on Sep 5 2017 12:45 AM

టాప్లోనే అశ్విన్

టాప్లోనే అశ్విన్

భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ టెస్టు ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు.

దుబాయ్:భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ టెస్టు ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో అశ్విన్ తొలి స్థానాన్ని కాపాడుకోగా, మరో భారత్ స్పిన్నర్ రవీంద్ర  జడేజా రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు.

 

మరొక భారత బౌలర్ మొహ్మద్ షమ్మీ 19వ స్థానంలో ఉన్నాడు.  ప్రస్తుతం భారత బౌలర్లు అశ్విన్(887 రేటింగ్ పాయింట్లు), జడేజా(879 రేటింగ్ పాయింట్లు)లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, ఆస్ట్రేలియా పేసర్ హజల్వుడ్(860 రేటింగ్) మూడో స్థానాన్ని ఆక్రమించాడు. పాకిస్తాన్తో జరిగిన సిరీస్లో 29 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న హజల్ వుడ్ తన ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. ఇదిలా ఉండగా, టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్  విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలి స్థానంలో ఉండగా, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మిగతా వేరే భారత బ్యాట్స్మెన్లు టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. చటేశ్వర పూజారా 12వ ర్యాంకులో ఉండగా, రహానే 16వ స్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement