లోథా ప్యానల్పై రవిశాస్త్రి మండిపాటు | Sakshi
Sakshi News home page

లోథా ప్యానల్పై రవిశాస్త్రి మండిపాటు

Published Sat, Sep 24 2016 1:02 PM

లోథా ప్యానల్పై రవిశాస్త్రి మండిపాటు

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రలో బోర్డు(బీసీసీఐ) ప్రక్షాళన కొరకు లోథా ప్యానల్ సూచించిన ప్రతిపాదనలను టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి తప్పుబట్టాడు. లోథా కమిటీ ప్రతిపాదించిన పలు సిఫారుసులు సరిగా లేవంటూ విమర్శించాడు. ప్రధానంగా బీసీసీఐలో ఒక సభ్యుడు పదవిలో ఉంటే సుదీర్ఘ విరామం తీసుకున్న తరువాతే మరో పదవి చేపట్టాలన్న లోథా సిఫారుసును రవిశాస్త్రి తీవ్రంగా తప్పుబట్టాడు.

 

ఈ తరహా నిబంధన బీసీసీఐ పరిపాలనలో పదవి చేపట్టాలనుకునే మాజీ క్రికెటర్లకు తీవ్ర విఘాతం కల్గిస్తుందన్నాడు.  బీసీసీఐ పరిపాలన విభాగంలో ఉన్న ఒక సభ్యుని పదవీ కాలం కనీసం ఆరు సంవత్సరాలు ఉండాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. దాంతో పాటు బీసీసీఐలో ఐదుగురు సెలక్టర్లతో కూడిన కమిటీ ఉండాలన్నాడు.

 

ఈ ఏడాది జనవరిలో లోథా ప్యానెల్ పలు సిఫారుసులను బీసీసీఐకి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అందులో 70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదనేది ఒకటైతే, ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు. రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు అనుబంధ సభ్యులు మాత్రమే ఉండాలని సూచించింది. దాంతో పాటు  ఒక సభ్యుడు మూడేళ్లు పదవిలో ఉంటే విరామం తీసుకుని తిరిగి మరో పదవి తీసుకోవాలని, అదే సమయంలో ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పదవిలో ఉండాల అంటూ బీసీసీఐకి ప్రతిపాదించింది.

Advertisement
Advertisement